ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడటం వల్ల ఏర్పడిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
బస్సు అల్మోరా నుండి హల్ద్వానీకి వెళ్ళిపోతుండగా 27 మంది ప్రయాణికులతో భీమ్‌తల్ నగర సమీపంలోని ఒక వంపు వద్ద అదుపుతప్పి 1,500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 15 అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకొన్నాయి. క్షతగాత్రులను రోప్‌ల సాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు.