Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛత్తీస్‌గఢ్‌లో 300 మంది మావోయిస్టుల దాడి...26కు పెరిగిన సీఆర్‌పీఎఫ్ మృతులు

భారత భద్రతా బలగాలపై సోమవారం మావోయిస్టులు జరిపిన అతి పెద్ద దాడిలో సీఆర్‌పీఎప్‌కు చెందిన 26 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరొక 7గురు గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో 10నుంచి 12 మంది నక్సల్స్ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట

ఛత్తీస్‌గఢ్‌లో 300 మంది మావోయిస్టుల దాడి...26కు పెరిగిన సీఆర్‌పీఎఫ్ మృతులు
హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (03:09 IST)
భారత భద్రతా బలగాలపై సోమవారం మావోయిస్టులు జరిపిన అతి పెద్ద దాడిలో సీఆర్‌పీఎప్‌కు చెందిన 26 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరొక 7గురు గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో 10నుంచి 12 మంది నక్సల్స్ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులకూ, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించారు. వీరంతా సీఆర్‌పీఎఫ్ 74వ బెటాలియన్‌కు చెందినవారు.
 
సౌత్ బస్తర్‌ ఏరియాలోని బుర్కపాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 12.25 గంటలకు సీఆర్‌పీఎఫ్ గాలింపు బృందంపై మావోయిస్టులు పెద్ద స్థాయిలో విరుచుకుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు హెలికాప్టర్‌లో తరలిస్తున్నామని, ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. కాగా, సీఆర్‌పీఎఫ్‌ గస్తీ పార్టీపై మావోయిస్టుల దాడి ఘటనను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
 
దాదాపు 300 మంది నక్సల్స్ వరకు ఈ దాడిలో పాల్గొన్నారని, తాము మాత్రం 150 మందిమే వున్నామని ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్ శేర్ మహమ్మద్ ఏఎన్ఐకి తెలిపారు. మొదట ఆదివాసీలని పంపించి తమ స్థలాన్ని గుర్తించిన అనంతరమే నక్సల్స్ ఈ దాడికి పాల్పడినట్టుగా మహమ్మద్ పేర్కొన్నారు. 
 
చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకి, సీఆర్పీఎఫ్ జవాన్లకి మధ్య చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్ల సంఖ్య 26కి చేరింది. గాయపడిన మరో ఏడుగురు జవాన్లని రాయ్‌పూర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టు మొదట వార్తలొచ్చినప్పటికీ.. ఆ తర్వాత మృతుల సంఖ్య 24కి చేరినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. ఈమధ్య కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే భారీ ఎన్‌కౌంటర్‌గా చత్తీస్‌ఘడ్ అధికారవర్గాలు తెలిపాయి.
 
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో 26 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో సిఎం రమణ్ సింగ్ క్షతగాత్రులైన జవాన్లను పరామర్శించారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన తిరిగివచ్చిన ఆయన జవాన్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రమణ్‌సింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం రాజ్‌నాథ్ ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిమెంట్ ధరలు తగ్గించాల్సిందే.. మంత్రి యనమల, బిల్డర్ల గోడు