దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠించిన మహారాష్ట్ర పాల్‌ఘర్ మూక దాడిలో కేసులో మరో 19 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సీఐడీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన వీరిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు. స్థానిక కోర్టు ఎదుట హాజరుపరిచగా.. మైనర్లను మాత్రం జూవైనల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరికి 14 రోజుల జ్యూడిషల్ కస్టడి విధించారు.
ఏప్రిల్ 16న పాల్‌ఘర్ ప్రాంతంలో దొంగలుగా భావించి ఇద్దరు సాధువులతో పాటు ఓ డ్రైవర్‌ను గ్రామస్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరెస్టు చేసిన వారిలో 70 ఏళ్ల వృద్ధుడితో పాటు ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఈ కేసులో సంబంధించి ఇప్పటివరకు 248 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో 105 మంది ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారని అధికారులు వెల్లడించారు.