Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 ప్లస్‌ వారిపై సమర్థవంతంగా పనిచేస్తోన్న ఫైజర్‌ టీకా!

Advertiesment
Pfizer vaccine
, గురువారం, 27 మే 2021 (11:09 IST)
భారత్‌లో సెకండ్‌ వేవ్‌లో అత్యధిక కరోనా కేసులు, మరణాలకు కారణమని భావిస్తున్న బి.1.617.2 వేరియంట్‌పై తమ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్రానికి ఫైజర్‌ తెలిపింది. అదేవిధంగా 12 సంవత్సరాల వయస్సు, ఆ పైబడిన ప్రతి ఒక్కరిపై ఈ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపితమైందని కూడా తెలిపింది.

వ్యాక్సిన్‌లు వృథా కాకుండా...దీన్ని రెండు నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పరిధిలో నెల రోజుల పాటు నిల్వ చేయవచ్చునని తెలిపింది. ఈ మేరకు త్వరతగతిన వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోదం పొందేందుకు ఈ అమెరికా ఫార్మా సంస్థ కేంద్రంతో చర్చలు జరుపుతోంది.

నిబంధనలను సడలించినట్లయితే, ప్రతికూల సంఘటన విషయంలో పరిహార దావాల నుండి రక్షణ ఇచ్చినట్లయితే...జులై, అక్టోబర్‌లో ఐదు కోట్ల మోతాదులను ఉత్పత్తి చేసి...విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిపై గత కొన్ని రోజులుగా ఇరు పక్షాల మధ్య వరుసగా సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశంలో ఫైజర్‌ చైర్మన్‌, సిఇఒ ఆల్బర్ట్‌ బౌర్లా కూడా పాల్గన్నారు. అదేవిధంగా ఇటీవల చేపట్టిన పరీక్షలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఇచ్చిన ధ్రువ పత్రాలను, సామర్థ్యం రేటు, ఆమోదాలకు సంబంధించిన డేటాను కూడా భారత్‌కు ఇచ్చిందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి నేడు.. ఆగస్టు 15న ప్రధాని అయ్యారు.. 17 సంవత్సరాల పాటు..?