Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొవిడ్ తర్వాత, భారతీయ పర్యాటకులకు ఏడాది పొడవునా ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్

Switzerland

ఐవీఆర్

, బుధవారం, 6 మార్చి 2024 (20:44 IST)
స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు నేడు  హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్‌లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది. కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో భారతీయ పర్యాటకులలో కనిపిస్తోన్న ధోరణులతో పాటుగా, భవిష్యత్తులో అభివృద్ధి చెందనున్న ప్రయాణ ధోరణులపై కొంత సమాచారమిచ్చింది. భారతీయ పర్యాటకులు తాము సందర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాలలో స్విట్జర్లాండ్ ఎల్లప్పుడూ తన స్థానం నిలుపుకుని ఉండటంతో పాటుగా తమ అభిమాన వేసవి గమ్యస్థానంగా ఇక్కడి వారికి నిలిచింది. మహమ్మారి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ, కొవిడ్ తర్వాత ఈ దేశం బాగా కోలుకుంది.
 
ఒకప్పుడు వేసవి గమ్యస్థానంగా మాత్రమే పరిగణించబడుతున్న స్విట్జర్లాండ్ ఇప్పుడు అన్ని సీజన్లలో, ముఖ్యంగా శరదృతువులో మాత్రమే కాదు చలికాలంలో కూడా భారతీయ పర్యాటకులచే సందర్శింపబడుతున్నది. “యాత్రలు, స్విట్జర్లాండ్‌లో గతంలో కంటే ఎక్కువగా విస్తరించాయి- స్విట్జర్లాండ్‌లో గడిపిన ఓవర్‌నైట్‌ల సంఖ్యలో 2019 కంటే 2023 మెరుగ్గా ఉంది. వేసవి, శీతాకాలం, స్కీ గమ్యస్థానాలకు విక్రయించబడిన వసతి, ముందస్తుగా బుక్ చేసిన కార్యకలాపాలను మేము చూస్తున్నాము. మహమ్మారి తర్వాత భారతదేశం నుండి, ఎక్కువ మంది వినూత్న అనుభవాలను కోరుకుంటున్న  ప్రయాణికులను తాము చూస్తున్నాము. వీరు తమ దేశంలో ఎక్కువ కాలం వుంటున్నారు. స్థానిక సంస్కృతిలో లీనమవుతున్నారు. అలాగే దేశంలో పర్యటించడానికి ప్రజా ప్రయాణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, తద్వారా పర్యాటకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా మలచాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు ,” అని విలేకరుల సమావేశంలో ఈస్ట్ మార్కెట్స్ చీఫ్ మార్కెట్స్ ఆఫీసర్ సైమన్ బోషార్ట్ అన్నారు.
 
భారతీయులు ఎక్కువగా జ్యూరిచ్, లూసెర్న్, ఇంటర్‌లాకెన్ వంటి నగరాలకు వెళతారు, అయితే జెర్మాట్-మాటర్‌హార్న్ (స్విట్జర్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్వతం) అలాగే ఇటాలియన్ మాట్లాడే ప్రాంతం టిసినో వంటి ప్రదేశాలను కూడా సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు. “స్విట్జర్లాండ్‌లో ప్రతి సంవత్సరం పర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే, ఇది ప్రయాణీకుల సమయాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన, స్థిరమైన ప్రయాణ గమ్యస్థానం, స్వచ్ఛమైనది, వ్యవస్థీకృతమైనది, అన్నింటికంటే ఎక్కువగా ప్రకృతి సౌందర్యంతో ఆశీర్వదించబడింది. కొవిడ్ తర్వాత ఎక్కువ మంది వ్యక్తిగత, చిన్న సమూహాలుగా ప్రయాణించడం మేము చూస్తున్నాము, వీరిలో ఎక్కువమంది తమ సెలవురోజులు మొత్తం ఒకే దేశంలో గడుపుతున్నారు. గత రెండేళ్ళలో టైర్ II/III భారతీయ నగరాల నుండి భారతీయ ప్రయాణీకులు ఎక్కువగా రావటం కూడా  మేము గుర్తించాము, ఇది మరొక ప్రోత్సాహకరమైన ధోరణి" అని స్విట్జర్లాండ్ టూరిజం-ఇండియా డిప్యూటీ డైరెక్టర్, మార్కెటింగ్ హెడ్ రీతు శర్మ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?