Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివరాత్రి రోజున శివార్చన చేస్తే దారిద్ర్యము తొలగిపోతుందట.. కథేంటో తెలుసుకోండి..

పూర్వం ఓ పేద బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని వద్ద విద్యాసంపద ఉన్నప్పటికీ దారిద్ర్యము వేధిస్తుండేది. ఎంత ప్రయత్నించినా చిల్లి గవ్వైనా దొరికేది కాదు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండేది. ఎవరినీ యాచించకుం

Advertiesment
శివరాత్రి రోజున శివార్చన చేస్తే దారిద్ర్యము తొలగిపోతుందట.. కథేంటో తెలుసుకోండి..
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (18:17 IST)
పూర్వం ఓ పేద బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని వద్ద విద్యాసంపద ఉన్నప్పటికీ దారిద్ర్యము వేధిస్తుండేది. ఎంత ప్రయత్నించినా చిల్లి గవ్వైనా దొరికేది కాదు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండేది. ఎవరినీ యాచించకుండా ఉండేందుకు పెళ్లి కూడా చేసుకోని ఆ బ్రాహ్మణుడు జీవితంపై విరక్తితో ఆత్మత్యాగం చేసుకోవాలని భావించి ఓ రాత్రి నిద్రపోయాడు. 
 
ఆ సమయాన నిద్రలో ఆ పండితునికి పరమేశ్వరి సాక్షాత్కరించింది. ఓయీ పండితోత్తమా.. ప్రాణం తీసుకోవాలని ఎందుకు పాకులాడుతావ్. సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది.  మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కలను చెప్పుకుంటాడు. ఏం చేయాలని అడుగుతాడు. 
 
ఆ పండితుడు జగదాంబ నిన్ను కరుణించింది కాబట్టి.. శివునికి ప్రీతికరమైన శివరాత్రి రోజున నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించమని సలహా ఇస్తాడు. అలా శివరాత్రి పూజ చేసిన ఆ పండితుడు... మరుసటి రోజు తనకు శక్తికి మేర ఫలాన్ని దానం చేస్తాడు. ఇలా ఆ పండితుడు దారిద్ర్యమును పోగొట్టుకుంటాడు. ఆరోగ్య వంతుడవుతాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థనారీశ్వరుని రహస్యమిదే... ఓ నమః శివాయ...