Article Love Tips %e0%b0%ae%e0%b0%a8%e0%b0%b8%e0%b1%81 %e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81 %e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b0%82 109010200010_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసు కాదు మస్తిష్కం.....

Advertiesment
వార్తలు కథనం ప్రేమ మనసు మస్తిష్కం ప్రభావం విజ్ఞాన శాస్త్రం ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు
ప్రేమ అనేది మాటలు, మనసుకు సంబంధించిందని ఇంతవరకూ మనం అనుకుంటూ వచ్చాం. కాని ఇది మనసుకు సంబంధించింది కాదని దీనిపై మస్తిష్క ప్రభావంవుందని విజ్ఞాన శాస్త్రం (సైన్స్) చెబుతోంది. ప్రేమ అనేది మానవుని మస్తిష్కంలోనున్న బయో కెమికల్ ద్వారా జరిగే పరిణామాల వలన ఉత్పన్నమవుతుందని పరిశోధకులు తెలిపారు.

సైన్స్ ఆఫ్ లవ్‌కు సంబంధించి అమెరికా పరిశోధకులు వివిధ కోణాలలో పరిశోధనలు చేశారు. ప్రేమించేవారు ఎందుకంత ఉద్రేకానికి లోనవుతారు, ప్రేమ మరియు శారీరక సంబంధాలకున్న సంబంధమేంటి, ప్రేమలో ఓడిపోతే విరహవేదనతో మానసిక వేదనకు గురై ఎందుకు బాధపడుతారు అనేవాటిపై పరిశోధనలు చేశారు.

న్యూయార్క్‌లోనున్న ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. లూసీ బ్రౌన్ తన అనుయాయులతో బాటు కాలేజీ చదువుతున్న విద్యార్థులపై పరిశోధనలుగావించారు. ఇందులో వారిఎదుట వారి వారి ప్రియలు...ప్రియరాళ్ళ ఫోటోలు వుంచారు.

పరిశోధనగావించేటప్పుడు వారి మస్తిష్కంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మార్పు సంభవించిందని, ఇందులో ప్రత్యేకమైన కోరికను పెంపొందించే గుణంవుందని వారు పేర్కొన్నారు. దీంతో మస్తిష్కంలోని ప్రత్యేకమైన భాగం ఏర్పడిందని దీనిని వెంట్రల్ టెగ్ మెంటల్ అంటారని తెలిపారు.

దీని ద్వారా న్యూరో ట్రాన్స్‌మీటర్ డోపామైన్ విడుదలౌతుంది. దీంతో ఆనందం ఉత్సాహం వెంట వెంటనే పుట్టుకొస్తాయని పరిశోధకులు తెలిపారు.
ఎవరిపైనైనా ప్రేమ పుట్టిందంటే మస్తిష్కంలో డోపామైన్ విడుదలౌతుందని డా. బ్రౌన్ తెలిపారు.

అలాగే కొకైన్ తీసుకుంటే వచ్చే ఆనందం, మత్తు మనిషి శరీరంలో ఎలా సంభవిస్తాయో అలాంటి పరిస్థితే ప్రేమలో పడ్డప్పుడు కూడా ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న డా. హెలెన్ ఫిషర్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu