Article Love Tips %e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 %e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%ae%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf 108123100036_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంధాలు..... అనుబంధమవ్వాలి...

Advertiesment
మనిషి సంఘజీవి బంధం అనుబంధం ప్రియుడు ప్రియురాలు స్నేహితులు సఖ్యత ప్రేమజంటలు
మనిషి సంఘజీవి. సమాజంతోబాటు తనుకూడా ముందుండాలని కలలుగంటుంటాడు. ఆ కలలకు తోడునిచ్చేదే బంధం. ఆ బంధం తల్లిదండ్రులదికావచ్చు, స్నేహితులది కావచ్చు, ప్రియుడు-ప్రియరాలి బంధమూ కావచ్చు.

ఆ బంధం అనుబంధంమై దృఢంగావుంటేనే మనసు కూడా కాస్త ఊరట చెంది ప్రగతి మార్గంవైపుకు దూసుకు వెళ్లగలిగేలా తోడ్పడుతుంది. మీ ప్రియురాలు/ప్రియుడు మీతో ఇదివరకటిలా సఖ్యతగావుండటం లేదా అయినా కూడా మీరు మీ ప్రియురాలు/ప్రియుడితో బంధాన్ని కొనసాగిస్తున్నారా...అయితే కాస్త తెలుసుకోండి.

మొదట్లో స్నేహితులుగా పరిచయం పెంచుకుని ఆ తర్వాత ప్రేమికులుగా మారే జంటలు ప్రపంచంలో కోకొల్లలు. ప్రారంభంలోవుండే ఆకర్షణ రానురాను వికర్షనగా మారి వారిద్దరి మధ్య వున్న బంధం పటాపంచలవుతుంది. వారిమాటల్లో, వారి చేష్టల్లోకూడా విచిత్రమైన ధోరణి కొట్టొచినట్టు కనపడుతుంది.

కాబట్టి ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ చిగురిస్తే అది కాస్త దృఢంగావుండడానికి ప్రేమికులిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీ మధ్యకూడా ప్రేమ బంధం బలహీనపడే ప్రమాదంవుండే సూచనలు కనపడుతుంటే ఈ చిట్కాలు కాస్త ప్రయోగించి చూడండి. దీంతో మీ ప్రియుడు/ప్రియురాలు మీ జీవితాంతం మీకు తోడుంటారు.

* మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడే సూచనలున్నాయా... ఉంటే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. దీంతో మీ మధ్యనున్నఎడబాటును తొలగించడానికి మీకుగా మీరు ప్రయత్నించండి.

* ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీ మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయో గుర్తుకు తెచ్చుకోండి. వాటిని నివారించడానికి ఇద్దరూ కలిసి చర్చించుకోండి. తప్పు మీదైనా, వారిదైనా సర్దుకు పోతే ఏ సమస్యావుండదు. అప్పుడుగాని మీ ప్రియుడు/ప్రియురాలు జీవితాంతం మీకు తోడు-నీడైవుంటారు.

* మీ మధ్య సఖ్యత ఏర్పడటానికి ఏదో ఒక ఉపాయం ఉండే తీరుతుంది. ఆ ఉపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దాంతో మీ ఎడబాటు మటుమాయమై ప్రేమబాటకు మార్గం సుగమం చేయగలుగుతుంది.

* మీరు అతను/ ఆమెను నిజంగా ప్రేమిస్తుంటే మీ ఆలోచనలుకు విలువివ్వమని చెప్పండి.

* మీరు కాస్త చనువు, స్నేహపూరితమైన భావంతోనే మీ ప్రియుడు/ప్రియురాలితో మెలగడం అలవాటు చేసుకోండి.

Share this Story:

Follow Webdunia telugu