Article Love Tips %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%af%e0%b0%b8%e0%b0%bf %e0%b0%ae%e0%b0%a8%e0%b0%b8%e0%b1%81 %e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%be 108072400052_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేయసి మనసు గెలిచారా... ?

Advertiesment
ప్రేమ చిట్కాలు ప్రేయసి మనసు గెలిచారా
ప్రేమ అనే అందమైన భావం మనసులోకి అడుగుపెట్టిందంటే చాలు అబ్బాయిలు అలా మెలికలు తిరిగిపోతుంటారు. అందాక తాను, తన ఫ్రెండ్స్ అంటూ తిరిగేవారు సైతం మనసు దోచిన అమ్మాయి హృదయాన్ని దోచేందుకు సిద్ధమైపోతుంటారు. ఇందులో భాగంగా క్లాసులకు బుద్ధిగా వెళ్లడం, లోకంలో తానే బుద్ధిమంతుడన్నంతగా ఆ అమ్మాయి ముందు ఫోజు కొట్టడం వగైరా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేస్తుంటారు.

మనసు గదిలో అడుగుపెట్టి మదిలోని భావాలను తట్టిలేపిన తన ఇష్ట సఖి కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటూ ముందుకు అడుగేస్తారు. అదేసమయంలో మనవాడి అదృష్టమో ఏమో తెలియదు కానీ కొద్దిరోజులకే ఆ అమ్మాయి సైతం అబ్బాయి వంక ఓరగా చూడడం ప్రారంభిస్తుంది. ఇకేం ప్రపంచాన్నే జయించిన వీరుడులా మనవాడు ఆనందంలో తేలిపోతాడు.
  మగాళ్లంటే ఆమెకున్న భయాలు, సందేహాలు మీ సమక్షంలో గుర్తు రానంతగా చేయండి. తనకు సరైన జోడు అంటే అది మీరే అని ఆమె స్థిర నిర్ణయానికి వచ్చేవరకు ఈ ప్రక్రియను అలాగే కొనసాగించండి.      


కానీ ఆ ఆనందంలో సైతం ఓ చిన్న క్వచ్చన్ మార్క్ ప్రత్యక్షమవుతుంది. అమ్మాయి మన వంక చూస్తోంది సరే ఇంతకీ మనల్ని ఇష్టపడుతోందా లేదా అన్నదే ఆ క్వచ్చన్ మార్క్. ఆ క్వచ్చన్ మార్క్ అలా పెరిగి పెరిగి పెద్దదవుతుందే తప్ప సమాధానం మాత్రం లభించదు. మరి అలాంటి సమయంలో మనసు దోచిన ప్రియురాలి మనసును గెలవాలంటే ఏం చేయాలి.


అందుకోసం పెద్ద ప్రపంచ యుద్ధాలేం చేయాల్సిన అవసరం లేదు. మీతో సాధారణంగా మాట్లాడే ఆ అమ్మాయిని మీతో మాత్రమే మాట్లాడేలా చేయగలగాలి. అందరిలో ఒకడిగానే మిమ్మల్ని సైతం భావించే ఆ అమ్మాయి దృష్టిలో మీరు మిగిలినవారికన్నా ప్రత్యేకమైన వారని నిరూపించగలగాలి. ముఖ్యంగా ఆమె కలల లోకంలో అస్పష్టంగా ఉన్న కలల రాకుమారుడు మీరేనని తెలిసేలా చేయాలి.
  మీ పొగడ్తలు నిజంగా నిజం కావని, ఏదో ముఖస్తుతి కోసమే అలా పొగిడేస్తున్నారని ఆమెకు అనిపించిందా ఇక మీపని అయిపోయినట్టే.      


పైన చెప్పినవన్నీ చేయడం అంత సులభమేమీ కాదు. అయితే అది అంత కష్టం కూడా కాదు. తెలివిగా ప్రవర్తించగల్గితే మీరు మెచ్చిన అమ్మాయితో ఐలవ్యూ అని చెప్పించడం అంత కష్టమేమీ కాదు. అందుకోసం మీరు ఏంచేయాలంటారా... మీ ఆలోచనలని, ఆనందాన్ని మీకు నచ్చిన అమ్మాయిపై పూర్తిగా కేంద్రీకరించండి. లోకంలో ఆమె తప్ప మీకు మరేదీ ముఖ్యం కాదన్న భావన ఆమె మదిలో తొంగిచూచేలా మాయ చేయండి.

ఆ అమ్మాయి ఆలోచనలు ఏ క్షణంలో ఎలా ఉంటాయో పరిశీలించండి. దానికి తగ్గట్టుగా మీరు మారడానికి సిద్ధంగా ఉండండి. ఆమె చేసే పనులు అంత గొప్పగా ఏం లేకపోయినా పనిగట్టుకు పొగడడం మాత్రం మర్చిపోకండి. ఆమె అందాన్ని, ఆమె అలంకరణను అప్పుడప్పుడు పొగడడం కూడా మర్చిపోకండి.

ఆ సమయంలో మీలో ఉన్న కవిగారిని కాస్త నిద్రలేపండి. ఇంకేం మీ పొగడ్తలకు, మీ ప్రశంసలకు ఆమె ఉబ్బితబ్బిబవడం ఖాయం. అయితే ఓ విషయం మాత్రం మర్చిపోవద్దు సుమా... మీ పొగడ్తలు నిజంగా నిజం కావని, ఏదో ముఖస్తుతి కోసమే అలా పొగిడేస్తున్నారని ఆమెకు అనిపించిందా ఇక మీపని అయిపోయినట్టే.

అందుకే పొగడ్తల్లో కూడా మీ తెలివితెటల్ని ప్రదర్శించండి. ఇతరులతో పోల్చి ఆమెను పొగడడం కాకుండా విడిగానే ఆమె మీకు నచ్చేసినట్టు తెలియజేయండి. అప్పుడే మీ పొగడ్తలు ఆమె మనసులో నాటుకుని ప్రతిక్షణం మీకోసం వెతికేలా చేస్తాయి. అలాంటి స్థితిలో ఉన్న ఆమె మనసులో మంచి వాడిగా మరింత స్థానం సంపాదించండి.

మగాళ్లంటే ఆమెకున్న భయాలు, సందేహాలు మీ సమక్షంలో గుర్తు రానంతగా చేయండి. తనకు సరైన జోడు అంటే అది మీరే అని ఆమె స్థిర నిర్ణయానికి వచ్చేవరకు ఈ ప్రక్రియను అలాగే కొనసాగించండి. అలా కొన్ని రోజులు సాగిన తర్వాత ఆమె హృదయంలోనూ ప్రేమ అలజడి సృష్టించడం ప్రారంభిస్తుంది.

అన్నాళ్లూ ఆమెను దగ్గరినుంచి గమనిస్తున్న మీకు ఆమెలోని అలజడిని గుర్తించడం అంత కష్టం కాకపోవచ్చు. అలాంటి అలజడి గుర్తించిన తర్వాత ఓ మంచి సన్నివేశంలో మీలోని ప్రేమభావాన్ని ఆమె సన్నిధిలో రాశులుగా పోయండి. అప్పటికే ఆమెలో మీపై పెరిగిపోయిన ప్రేమభావం పోటీపడి మరీ మీకోసం బయటకు వచ్చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu