ప్రేమించడానికి, ప్రేమించబడడానికి ప్రత్యేకంగా తర్ఫీదు అవసరంలేదంటారు. అయినా కూడా కొంతమంది కొన్ని చిట్కాలు అనుసరిస్తుంటారు. మీరు కూడా ప్రేమలో పడ్డారా...అయితే ఆ చిట్కాలేంటో చూడండి.
మోడ్రన్ స్టైల్.. మోడ్రన్ స్టైల్ అంటే ప్రస్తుతం వస్తున్న ఫ్యాషన్ గురించి ఆలోచించకండి. ఇదివరకటి వస్త్ర ఫ్యాషన్‌ను కూడా లేటెస్ట్ ట్రెండ్‌గా ఇప్పటి యువత పాటిస్తున్నారు. మీరు నిజంగానే యువకులైతే యువకులలాగానే వుండండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. మీ అలవాట్లు, మీ మాటల వలన మీ మిత్రులకు, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి.
కళ్ళల్లో..కళ్ళు పెట్టి చూడు..మీ కళ్ళు మీ మనసును తెలుపుతుంది. మీ చూపులతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి. ఇది ప్రేమకు ఇబ్బందికర పరిణామానికి దారితీస్తుంది. ముఖ్యంగా కన్నుల భాషను తెలుసుకోండి. అందునా అమ్మాయిలైతే చానా జాగ్రత్తగా వుండాలంటున్నారు పరిశోధకులు. ఈ కన్నుల భాషను కనుక మీరు నేర్చుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆ కళ్ళు మిమ్మల్ని మోసం చేయవు అని మీకు నమ్మకం కలిగితే మీరు ప్రేమలో పడొచ్చంటున్నారు.
తొలి కలయిక..... మొట్ట మొదటి కలయిక చాలా ఆందోళన, అమితమైన ఉత్సాహంగానూ వుంటుంది. ఇది తొలి అడుగుగా భావించండి. ఈ తొలి కలయికతో ఎవరు ఎలాంటి కోరికతో వస్తున్నారో కూడా తెలిసిపోతుందంటున్నారు పరిశోధకులు.
కొత్త కొత్తగావున్నది.... ప్రతి ప్రియునికి ప్రియురాలికి వారి తొలి కలయికలో కొత్తదనంవుంటుంది. మీరు మాట్లాడే మాటలు మృదువుగానూ మనసుకు హత్తుకునేదిగానూ వుండాలి. మాటలు కాస్త పెంచాలనుకుంటే చివరిమాటను కలుపుతూ వేరొక విషయాన్ని జోడించి మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిలో ఆసక్తి కలిగేలావుండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మనసును ఆహ్లాద పరిచేదిగా వుండాలి.
అందులో హాస్యం కూడా మిళితమైవుండాలి. ఆ తర్వాత మీ గురించి తెలపాలి. మీ గురించి తెలిపిన తర్వాత వారిగురించి అడగండి. ఇద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకునేదిగావుండాలి మీ మాటలు.
మీ ప్రేమను వ్యక్తపరచండిలా... మీ ప్రేమను వ్యక్తపరచడానికి అనువైన సమయాన్ని తెలుసుకోండి. అటువైపు కూడా ప్రేమకు మార్గం సుగమం అయ్యేలా వున్నప్పుడే మీరు మీ మనసులోని మాటను వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. కొన్ని సందర్భాలలో ఇద్దరిమధ్య అవగాహన వుంటుంది, కాని మీ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం మానకండి.
మీ ప్రేమను వ్యక్తపరిచే సందర్భంలో ఎదుటి వారి మనసు యొక్క పరిస్థితి, సమయం, సందర్భం కూడా చూడాలి. నేరుగా వ్యక్తపరచడంలో ఓ ఆనందం, అలాగే మాటలను సాగదీస్తూ వ్యక్తపరచడంలో కూడా ఆనందంవుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే ఎదుటి వ్యక్తికికూడా కాస్త ఆనందం కలుగుతుంది.
ప్రేమలో అలకలు మామూలే. వాటిలోనున్న ఆనందమే వేరంటున్నారు పరిశోధకులు. దీనికి ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోమంటున్నారు. ప్రేమతో పోట్లాడుకోవడంలో ఆ ఆనందమే వేరు. పోట్లాడేటప్పుడు మధ్యమధ్యలో మీ ముఖంపై కాస్త చిరునవ్వును చిందించండి.
వారి మాటలను అర్థం చేసుకోండి... ఇద్దరి మధ్య వచ్చే మాటలను అర్థం చేసుకోండి. ఇద్దరూ సంభాషించుకునేటప్పుడు మీ మధ్యలో పూలపరిమళాలను వెదజల్లేలా చూసుకోండి. ఎందుకంటే ఆ పూలవలన మీ మధ్య ప్రేమ పెరగడానికి దోహదపడుతుంది. ప్రతి రోజు ఓ కొత్త పరిమళం వెదజల్లే వస్తువును వాడండి. అది పూలు లేదా స్ప్రే కావచ్చు. మీ శరీరం చందన పరిమళాలు వెదజల్లేదైవుండాలి.
డేటింగ్‌లో ఎలా పాల్గొనాలి.. డేటింగ్ కొరకు ఓ మంచి పార్కు లేదా మంచి రెస్టారెంటుకు వెళ్లండి. మీరు ధరించే వస్త్రాలు కాస్త వదులుగా వుండేలా చూసుకోండి. డేటింగ్ సమయంలో మీ మాటలు ఎదుటివారి మనసును ఆనంద పరిచేవిగా వుండాలి. అలాగే మీరు తీసుకునే ఆహారం కూడా అల్పాహారంగా వుండేలా చూసుకోండి. వారి అలవాట్లను, అందాన్ని అప్పుడప్పుడు మీరు మెచ్చుకుంటుండాలి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లడండి. చీకటి పడక మునుపే ఇంటికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోండి.
ప్రేమ కానుక...బహుమానమివ్వడానికి కేవలం జన్మదినమే కానక్కరేలేదు. ఎన్నో అవకాశాలుంటాయి. వాటిని మీరు తెలుసుకోవాలి. ఆ బహుమానం అతి విలువైనది, లేదా అతి తక్కువ ధరది కూడా ఉండక్కర లేదు. ఆ బహుమానాన్ని తీసుకోవడంలో మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ఎలాంటి సంకోచం ఉండకూడదు.
చివరిగా.. ప్రేమ జగత్తు చాలా విస్తారమయినది. ప్రేమతో బాటు మీ ప్రేయసి లేక ప్రియడిని జీవిత భాగస్వామిగా చేసుకోవడంలో మీరు ముందడుగు వేయాలనుకుంటే మీ కోరికను వారికి తెలియజేయండి. మన దేశంలోని సినిమాలలో కథలన్నీ కూడా ప్రేమతో ప్రారంభమై పెళ్ళితో ముగుస్తుంది. కాని మీరు వివాహం తర్వాత కూడా మీ ప్రేమను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకునేటట్టయితే వివాహం తర్వాత కూడా ప్రేమించడం ప్రారంభించండి.