Article Love Poems %e0%b0%b5%e0%b1%87%e0%b0%a1%e0%b0%bf %e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81 107061300035_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడి కోరికలు

Advertiesment
వేడి కోరికలు
పాల కొలనుల నల్ల గలువలు తెలుపు సంగతులు,
పూల వనులై, పరిమళించగ, పోయె నా మతులు !!

నీలవేణీ ! నీ స్వరాలను మెచ్చి నా కనులు
ఆలకింపగ సాగె గీతులు, మఱచి తమ పనులు !!

ఎగురు పయ్యెద నుండి వీచెను వలపు తెమ్మెరలు!
చిగురు పెదవులు చిందగను లేనగవు దొంతరలు !!

తొగరు బుగ్గల సిగ్గు నిగ్గుల వేడి కోరికలు
అగరు పొగలకు తావులిడగల వగల మాలికలు !!

నీ వదనమున మెఱయు శోభల కళలె చంద్రికలు !
నీ వరాంగములందు మెండుగ గలవు పొందికలు !!

నీ విలాసము లెడద ఆశల కొసగె నా రతులు !
నీ వికాసములీను కాంతుల వెలిగె నా కృతులు !!!

Share this Story:

Follow Webdunia telugu