కొలనులోని పువ్వులు !
వలపు రాణి నవ్వులు !!
వలరాయని సైగలు !
అలల కలల తీగలు !!
రతి సొగసుల మించగా !
ప్రకృతి శోభ పెంచగా !
నవ మన్మధుడెంచగా !
నవత పరిమళించగా!
స్వరములు రవళించగా!
శరములు పయనించగా!
విరుల వాన కురియగా!
అరసి సరసి మురియగా కొలను
ప్రకృతిని తిలకించగా!
ప్రతిమది పులకించగా!
రసికత నర్తించగా!
ప్రభలను వర్ణించగా!
కల్పన స్పందించగా!
కవితలు ఉదయించగా!
మధురిమలై ధారగా!
సుధలు జాలువారగా!!
కొలనులోని పువ్వులు వలపురాణి నవ్వులు!!!