Publish Date: Fri, 03 Oct 2008 (19:11 IST)
Updated Date: Fri, 03 Oct 2008 (18:05 IST)
నిశీధి రాత్రిలో తొలి కిరణం నీవు...
ఆశల సౌధానికి పునాది నీవు...
ఎడారి పయనంలో నీటి చెలమ నీవు...
శిశిరంలో అరుదెంచిన వసంతానివి నీవు...
అర్థమెరుగని జీవితానికి పరమార్ధం నీవు...
అలసిన మనసుకు ఓదార్పువు నీవు...
నేనంటూ ఉన్నానని చెప్పింది నీవు...
నాలోని ప్రతి ఆశకు సంకేతానివి నీవు...
నాలోని ప్రతి తలపుకు ప్రారంభానివి నీవు...
నా ఒంటరి జీవితంలో తొలి నేస్తానివి నీవు...
ఇన్నాళ్ల నా ఎదురుచూపుకు అర్థం నీవు...
నా ఇన్నేళ్ల జీవితానికి పరమార్థం నీవు...
నాకు మాత్రమే కనిపించే సరికొత్త రూపానివి నీవు...
అన్నీ నీవు... అంతటా నీవు... నాలోని ప్రతి అణువూ నీవు...
నాలో చలనాన్ని రగిలించింది నీవు...
నాకు సరికొత్త లోకాన్ని చూపించిందీ నీవు...
కానీ నాకు మాత్రం ఏమీ కావు...