Publish Date: Tue, 23 Oct 2007 (20:25 IST)
Updated Date: Tue, 23 Oct 2007 (20:23 IST)
జాజిపువ్వు మనసులాంటి బంగారీ
జంటగా ఉండాలి ప్రతిక్షణం యిహ మరీ
బంతిపువ్వులాంటి ఓ నా బంగారీ
బరువు నిండిన బాధ ఎప్పటిదాకో మరీ
స్వర్ణకమలం లాంటి నా బంగారీ
స్వంతమవుతావుగా నాకు తెలుసు మరీ
ప్రతి సూర్యకిరణంలో నిండిన ఓ నా బంగారీ
ప్రతిరోజూ ప్రత్యక్షమవుతాయి నా ముందుమరీ
కలువరాజు పంచే కమ్మని వెన్నెల లాంటి బంగారీ
కమ్మగా పంచుతావు నీ చల్లదనాన్ని నాకు మరీ
మంచుబిందువులాంటి ఓ నా బంగారీ
మనసులో కరిగిపోయావు నాలో మరీ
కలలో ఇలలో అగుపించే ఓ నా బంగారీ
కలకాదు! నిను మరువలేను సారీ!
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు