Article Love Poems %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a3%e0%b0%af %e0%b0%a8%e0%b1%8c%e0%b0%95%e0%b0%b2%e0%b1%81 107052400073_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణయ నౌకలు

Advertiesment
మగువ అందచందాలు పలుతావుల పువ్వులు
మగువ అందచందాలే పలుతావుల పువ్వులు !
మగువకు రత్నాల సగలు, తెలివెన్నెల నవ్వులు!!

మగువ శీల సంపదయే రుచులూరే మకరందం !
మగువ కురియు అనురాగమె మగని మదికి చందనం!!
మగువ వదన శోభయే మురిపించే అరవిందం !
మగువ పలుకు ప్రతి పలుకూ, పతి హృదయ స్పందనం!!

మగువ చూపు మరులూరే మన్మథ బాణం !
మగువ వలపు పిలుపదే మగనికి ప్రాణం !!
మగువ నెంచు ప్రతి తలపూ కోయిల గానం !
మగువ పెదవి విందే కద ప్రేమ సుధాపానం!!

మగువ కన్నుసన్నలే నవరసాల గిన్నెలు!
మగువ సొగసు చూడ చూడ వానవిల్లు వన్నెలు!!
మగువ రేపు కోరికలే రతికి వెలుగు రేకలు!

Share this Story:

Follow Webdunia telugu