Publish Date: Mon, 21 Jul 2008 (17:11 IST)
Updated Date: Mon, 21 Jul 2008 (17:09 IST)
మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు
నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు
ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు
మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు
వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు
సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు