కన్నీటి తెరల మాటున తడవకూడదు

నీ కన్నులు కైపెక్కించాలి కానీ కన్నీటి తెరల మాటున తడవకూడదు నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ వుండాలి కానీ ఎర్రమందారంలో ఎరుపెక్కకూడదు

మంగళవారం, 13 జూన్ 2017 (21:20 IST)
నీ కన్నులు కైపెక్కించాలి కానీ
కన్నీటి తెరల మాటున తడవకూడదు
నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ వుండాలి కానీ
ఎర్రమందారంలా ఎరుపెక్కకూడదు
 
నీ పెదవులు తమకంతో తడవాలి కానీ
ఆవేదనతో అధరాలు అదరకూడదు
నీ హృదయం ప్రేమామృతం చిందించాలి కానీ
పలు విధాలుగా చింతించకూడదు
 
నీ మాటలు మత్తెక్కించాలి కానీ
మథనపడుతూ వుండకూడదు
నీ స్వరం సంతోషాల సంగమం కావాలి కానీ
దుంఖాల సాగరం కాకూడదు
 
నీ కనులు నీ ముగ్ధమనోహర రూపం
నీ హృదయం నీ పలుకు సంతోషమైతే నాకు వెన్నెలే....
ఆ కనులు ఆ హృదయం ఆ పలుకు ఆవేదనలైతే అమావాస్యలే...
- యిమ్మడిశెట్టి  వెంకటేశ్వర రావు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎంత ఉష్ణోగ్రత వున్న నీటిని తాగితే ఆరోగ్యం...?