Article Love Jokes %e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81 %e0%b0%b5%e0%b0%b2%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8b 108010200048_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను వలచిందెవరో?...

Advertiesment
భార్యను కోల్పోయిన సుబ్బారావు
భార్యను కోల్పోయిన సుబ్బారావు, భర్తను కోల్పోయిన సుందరీ హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో జరిగిన మందు పార్టీలో కలుసుకున్నారు. అప్పటికే ఇద్దరూ మందు మత్తులో జోగుతున్నారు. తొలి చూపులోనే ఇద్దరు ఒకరిపై ఒకరు పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. డిన్నర్ పూర్తయ్యాక సుబ్బారావు అడిగాడు సుందరిని.

సుబ్బారావు: "నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
సుందరి: "దానికేం భాగ్యం అలాగే కానిద్దాం"

వారిరువురి కలయిక అలా ఆనందకరంగా మొదలైంది. మర్నాడు ఉదయం నిద్రలేచిన సుబ్బారావుకు సుందరి తనతో పెళ్ళికి అవునన్నదా కాదన్నదా అనే అనుమానం వచ్చింది. ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. చివరకు సుందరికి ఫోన్ చేశాడు.

సుబ్బారావు: "హలో నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను. ఇంతకీ నన్ను పెళ్ళి చేసుకోవడానికి అవును అని అన్నారా? కాదన్నారా?"
సుందరి: "భలేవారండీ అవుననే అన్నాను. అయితే ఎవరితో అవును అని అన్నానో గుర్తుకు రాక సతమతమవుతుంటే దేవుడి దయవలన మీ ఫోన్ కాల్ వచ్చింది. థ్యాంక్సండి".
సుబ్బారావు: ఆ...

Share this Story:

Follow Webdunia telugu