Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్!!

yousuf pathan

ఠాగూర్

, ఆదివారం, 10 మార్చి 2024 (16:39 IST)
సార్వత్రిక ఎన్నికల బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ పఠాన్ బరిలోకి దిగనున్నారు. ఆయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు. ఆయనకు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో బహరంపూర్ లోక్‌‍సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బహరంపూర్‌ నుంచి గతంలో కాంగ్రెస్ ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఐదుసార్లు విజయభేరీ మోగించారు. ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు.
 
అయితే ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ అధిర్ రంజన్ చౌదరి మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో గెలుపొందిన ఆయన మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమైన నేపథ్యంలో పదేపదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరిపై తృణమూల్ కాంగ్రెస్ ప్రముఖ వ్యక్తి యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దింపడం గమనార్హం. మరి వచ్చే లోకసభ ఎన్నికల్లో యూసుఫ్ పఠాన్ అదృష్టం ఎలా ఉండబోతోందో వేచూడాల్సిందే.
 
కాగా మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 స్థానాలు ఉండగా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో పొత్తు లేదని అధికారికంగా పార్టీ వెల్లడించింది. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విపక్షాల ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతోందని, ఈ పొత్తు తమకు అక్కర్లేదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుష్ట శిక్షణ - శిక్షణ రక్షణ కోసమే ఏపీలో పొత్తులు : దగ్గుబాటి పురంధేశ్వరి