సూరత్ లోక్‌సభ స్థానం భాజపా కైవసం అయ్యింది. ఎన్నిక జరగకుండానే అక్కడ భాజపా తన ఖాతాలో లోక్ సభ స్థానాన్ని వేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ను ఈసీ రద్దు చేయడంతో ఆ స్థానంలో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం ఇచ్చారు.
మరో ఎనిమిది మంది అభ్యర్థులను ఒప్పించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో ఏడుగురు అభ్యర్థులు అంగీకరించారు. ఒక BSP అభ్యర్థి ప్యారేలాల్ భారతి కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. దీనితో బిజెపి అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా సూరత్ స్థానంలో గెలుపొందారు. గుజరాత్ చరిత్రలో తొలిసారిగా సూరత్ సీటును పోటీ లేకుండా ప్రకటించారు.