కృష్ణా పుష్కరాల్లో హెలికాప్టర్ ద్వారా గగన విహారం... 2 రోజుల వరకూ వెయిటింగ్ లిస్ట్...
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు భలే మంచి హెలికాప్టర్ బేరం బెజవాడలో ఏర్పాటు చేశారు. కేవలం 1998 రూపాయలు కడితే, హెలికాప్టర్‌లో అలా అలా విజయవాడ అంతా ఒక రౌండ్ కొట్టేయవచ్చు. విజయవాడ స్టెల్లా కాలేజీలో ఈ హెలికాప్టర్‌ని ఏర్పాటు చేశా
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు భలే మంచి హెలికాప్టర్ బేరం బెజవాడలో ఏర్పాటు చేశారు. కేవలం 1998 రూపాయలు కడితే, హెలికాప్టర్‌లో అలా అలా విజయవాడ అంతా ఒక రౌండ్ కొట్టేయవచ్చు. విజయవాడ స్టెల్లా కాలేజీలో ఈ హెలికాప్టర్‌ని ఏర్పాటు చేశారు. దీనిలో ఒక్కొక్కరికి 1,998 రూపాయలు వసూలు చేస్తున్నారు.
దీని ద్వారా పుష్కర ఘాట్లలో... కృష్ణా నదిపై విహారం ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5 వేల మందిని ఈ హెలికాప్టర్ ద్వారా ట్రిప్ వేశారు. సిటీతో పాటు పుష్కర ఘాట్లపై ఎంతో నయనానందకరంగా హెలికాఫ్టర్ రైడ్ ఉంటోంది. ఇప్పటికీ రెండు రోజులపాటు వెయిటింగ్ లిస్ట్ ఉందంటే... ఈ హెలికాప్టర్ రైడ్ ఎంత క్రేజో చూశారా...?