శభాష్ బాబు... పుష్కరాలను ప్రణాళికాబద్ధంగా సక్సెస్ చేసిన ఏపీ సీఎం
విజయవాడ : లక్షలాదిమంది భక్తులు వచ్చే కృష్ణా పుష్కరాలను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వందలాది పుష్కర ఘాట్లను ఎంతో విశాలంగ
విజయవాడ : లక్షలాదిమంది భక్తులు వచ్చే కృష్ణా పుష్కరాలను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వందలాది పుష్కర ఘాట్లను ఎంతో విశాలంగా ఏర్పాటు చేసి, ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా తయారుచేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. అటు తెలంగాణా, ఇటు తమిళనాడు, కర్నాటక, కేరళ... ఇలా పరిసర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కృష్ణా పుష్కరాలకు విశేషంగా హాజరవుతున్నారు. అందరి నోటా ఇక్కడి ఏర్పాట్లు చూసి ఒకటే మాట... శభాష్ బాబు.
ముందుగా పుష్కరాలకు విజయవాడకు వచ్చిన భక్తులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ సీఎం కల్పించారు. అన్ని పుష్కర ఘాట్లకు ఆర్టీసీ బస్సులు యాత్రికులను చేరవేస్తున్నాయి. అలాగే, భక్తులందరికీ ఉచితంగా అన్న ప్రసాదాలు స్వచ్చంద సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. 35 వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. అంతేకాదు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని, ఏ ఘాట్లో జనం ఎక్కువైతే, అక్కడి నుంచి మిగతా ఘాట్లకు యాత్రికులను డైవర్ట్ చేస్తూ, తొక్కిసలాటలు లేకుండా చేస్తున్నారు. అన్ని ఘాట్లను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దీనితో భక్తులు ఎంతో ఆనందంగా పుష్కర స్నానం చేసి, పుష్కర స్నానం తృప్తిగా చేశామంటూ తిరిగివెళుతున్నారు.
నిరంతరం ఘాట్లను పరిశీలించిన సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లను నిత్యం సందర్శిస్తూ, యాత్రికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. అధికారుల పనితీరు ఎలా ఉందో సర్వే ద్వారా ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు అమరావతిలోని ధ్యాన బుద్ధ ఘాట్‌లో సౌకర్యాలపై యాత్రికులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి ఘాట్ వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూలమాల వేసి భక్తులనుద్దేశించి మాట్లాడారు. మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి, సునీత, ఎంపీ జయదేవ్, కలెక్టర్ కాంతిలాల్ దండే సీఎం వెంట ఉన్నారు.