Publish Date: Fri, 29 Aug 2008 (12:58 IST)
Updated Date: Fri, 29 Aug 2008 (12:57 IST)
వఱదైన చేనుదున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!
తాత్పర్యం :
వరద వచ్చే పొలమును వ్యవసాయము చేయకూడదు. కరువు వచ్చినచో చుట్టాలను చూసి కరుగవద్దు. ఇతరులకు రహస్యాలు చెప్పవద్దు. అంతేగాకుండా భయం కలిగిన వాడికి సేనా నాయకత్వం ఇవ్వకూడదని శతకకారుడు చెబుతున్నాడు.