Publish Date: Tue, 23 Sep 2008 (10:23 IST)
Updated Date: Tue, 23 Sep 2008 (10:22 IST)
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కైవతినే పో
నెపములు వెదకునుగడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ...!
తాత్పర్యం :
చెరకు గడ మొదలు తియ్యగా ఉండి, నడుమ తీపి తగ్గి చివరకు చప్పబడునట్లుగానే... చెడు స్నేహం మొదట ఇంపుగానూ, నడుమ వికటంగానూ, చివరకు చెరుపు కలిగించేదిగానూ ఉండును. కాబట్టి చెడు స్నేహాలు చేయకూడదని ఈ పద్యం యొక్క భావం.