Publish Date: Thu, 24 Jul 2008 (11:50 IST)
Updated Date: Thu, 24 Jul 2008 (11:50 IST)
స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నింద సేయ కెన్నడు సుమతీ...!
తాత్పర్యము : స్త్రీలతో ఎప్పుడూ గొడవపడవద్దు. చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను ఎప్పుడూ వదలవద్దు. యజమానిని దూషించవద్దు అని పై పద్యం యొక్క భావము. ఇది రాజ రాజ మనోజ, దశదిశా భరణ వివేక భూషణ, కవిబ్రహ్మ ఇత్యాది బిరుదాంకిత భద్రభూపాల ప్రణీతంబైన సుమతీ శతకము.