Publish Date: Thu, 07 Aug 2008 (11:50 IST)
Updated Date: Thu, 07 Aug 2008 (11:49 IST)
ద్వారం బంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటి కొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువి లోన
విశ్వదాభి రామ వినుర వేమా...!
తాత్పర్యం :
ద్వారానికి తలుపులు, గడియలు ఉన్నట్లుగానే... మాటలకు కూడా నియమాలు రక్షణగా ఉపయోగపడతాయి. ధర్మాన్ని గుర్తించి, దానికి తగినట్లుగా మాట్లాడే వాడే ధన్యుడు, ఉత్తముడని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన మహాకవి.