Publish Date: Fri, 29 Aug 2008 (12:54 IST)
Updated Date: Fri, 29 Aug 2008 (12:53 IST)
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులమకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ..!
తాత్పర్యం :
పూజకంటే బుద్ధి ప్రధానం. మాట కంటే మనసు ప్రధానం. కులం కంటే గుణం ప్రధానమని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన మహాకవి.