Publish Date: Wed, 23 Jul 2008 (11:37 IST)
Updated Date: Wed, 23 Jul 2008 (11:36 IST)
పదుగురాడు మాట పాడియై ధరజెల్లు
నొక్కడాడు మాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ!
భావము :
పదిమంది చెప్పిన మాట అసత్యమైనా కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండే వాడే ఉత్తముడు.