Publish Date: Sat, 16 Aug 2008 (11:42 IST)
Updated Date: Sat, 16 Aug 2008 (11:39 IST)
నీవాడిన నేనాడును
నీ వుండిన నేనుండు నిర్వణ్ణుఁడనై
నీవు దలంచినఁ దలపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా!
తాత్పర్యము :
ఓ పరమాత్మా నీవు ఆడుతూ ఉంటే, నేనూ ఆడుతూ ఉంటాను. నీవు నిర్వికారంగా ఉంటే నేనూ నిర్వికారంగానే ఉంటాను. నీవు నన్ను తలచుకుంటూ ఉంటే నేనూ నిన్ను తలచుకుంటూ ఉంటాను. నువ్వు నవ్వుతూ ఉంటే నేనూ నవ్వుతూ ఉంటానని ఈ పద్యం యొక్క భావం.