Publish Date: Mon, 18 Aug 2008 (11:56 IST)
Updated Date: Mon, 18 Aug 2008 (11:55 IST)
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ.
తాత్పర్యం :
పూర్వజన్మంలో దానం చేసినట్లయితే, కీకారణ్యాల మధ్య ఉన్నప్పటికీ సకల సౌకర్యాలు, పదార్థాలు లభ్యమవుతాయి. అదే పూర్వ జన్మంలో దానం చేయనట్లయితే బంగారు కొండ మీదికి ఎక్కి కూర్చున్నా ఏమీ దొరకదు. కాబట్టి ఇప్పుడు దానం చేస్తే తరువాతి జన్మలో సకల సౌక్యాలు కలుగుతాయని సుమతీ శతకకారుడు చెబుతున్నాడు.