Article Kids Poems %e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a1%e0%b0%82 %e0%b0%a4%e0%b1%87%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b1%87 108072600020_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెప్పడం తేలికే...!

Advertiesment
బాలప్రపంచం కవితలు తనువు ధనము డాంబికుడు సత్యం పద్యం వేమన
తనువులస్థిరమని ధనములస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వధాభిరామ వినురవేమ!

తాత్పర్యం :
ఈ శరీరం, ఈ ధనం అన్నీ అశాశ్వతం అని డాంబికుడు పది మందికీ చెబుతాడే తప్ప, తాను మాత్రం ఆ సత్యాన్ని విశ్వసించి ఆచరించడు. చెప్పడం తేలికే ఆచరించడమే కష్టం. చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు. అలాకానివాడు మానవ సమాజానికే బరువు అని ఈ పద్యం భావము. వేషభాషలతో జనాన్ని మోసం చేస్తున్న వారికి ఈ పద్యము ఒక చురక, మోసపోతున్నవారికి ఒక హెచ్చరిక.

Share this Story:

Follow Webdunia telugu