Article Kids Poems %e0%b0%98%e0%b0%a8 %e0%b0%aa%e0%b1%81%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 108100900023_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘన పుణ్యచరిత్ర

Advertiesment
బాలప్రపంచం కవితలు పాపం తీగ కొడవలి ఖరదూషణాదులు అడవి అగ్ని భూమి విచిత్ర పుట్టుక విధి పద్మం నేత్రం మేఘకాంతి
FileFILE
దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ...!

తాత్పర్యం:
పాపమనే తీగలకు కొడవలి వంటివాడవు, ఖరదూషణాదులనే అడవికి అగ్ని వంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుక అనే ముడిని విడదీయుటయే విధిగా గలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు అయిన శ్రీరామా...! అని ఈ పద్యంలో కీర్తించాడు భక్తరామదాసు.

Share this Story:

Follow Webdunia telugu