Publish Date: Thu, 04 Sep 2008 (12:48 IST)
Updated Date: Thu, 04 Sep 2008 (12:46 IST)
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి... దాశరధీ కరుణాపయోనిధీ..!
తాత్పర్యం :
జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుస్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా..! అని రామదాసు శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాడని భావం.