Publish Date: Mon, 04 Aug 2008 (11:52 IST)
Updated Date: Mon, 04 Aug 2008 (11:51 IST)
ఉయ్యాల జంపాలలూగరారమ్మ
వెలలేని బంగారుటుయ్యాల "ఉయ్యాల"
కమలమందున బుట్టీ కమలాక్షుని చేపట్టి
కాముని కన్నట్టి కంజదళనేత్రి "ఉయ్యాల"
శుభశుక్రవారమున సుదతులు వూప
నూరి జనము పొగడ సందరముగాను
కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను
కావేటీ రంగనితో వెలసితివి తల్లీ "ఉయ్యాల"
శ్రీ విల్లి పూత్తూరిలో వెలసితివి తల్లీ
శ్రీ రంగధాముని చేపట్టితివమ్మా
చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి
చేతనులను రక్షించ చెలులందరు ఊప "ఉయ్యాల"