Publish Date: Mon, 25 Aug 2008 (12:38 IST)
Updated Date: Mon, 25 Aug 2008 (12:37 IST)
పనితొడవులు వేఱు బంగారమొక్కటి
పరగ ఘటము వేఱు ప్రాణమొకటి
అరయ దిండ్లు వేఱు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ...!
తాత్పర్యం :
ఆభరణాలు వేరయినా బంగారం ఒకటే... ఘటము వేరయినా శబ్దం ఒక్కటే... భోజనం వేరయినా ఆకలి ఒక్కటేనని ఈ పద్యం యొక్క భావం.