Publish Date: Fri, 12 Sep 2008 (12:09 IST)
Updated Date: Fri, 12 Sep 2008 (12:04 IST)
కనియు గానలేడు, కదలప డానోరు
వినియు వినగలేడు విస్మయమమున
సంపద తలవాని సన్నిపాతం బిది,
విశ్వదాభిరామ విను వేమ...!
తాత్పర్యం :
సంపద కలిగిన వారిలో కొంతమంది అహంకారమనే రోగంతో... లోకంలోని మంచి ధర్మాలను గ్రహించలేరు. ఇలాంటివారు ఎదుటివారు మంచితనంతో ఏమి చెప్పినా వినే లక్షణం కలిగి ఉండరని ఈ పద్యం యొక్క భావం.