"ఒరేయ్ పిల్లలూ... మన దేశం చాలా గొప్పది. ఇక్కడ అనేకమంది గొప్పవాళ్లు పుట్టారు. ఈ దేశంలో పుట్టినందుకు మనందరం కూడా గొప్పవాళ్లమే.." పాఠం చెప్పుకుంటూ పోతోంది టీచర్.
కాసేపటి తరువాత "ఒరేయ్ సిద్ధూ...! మనదేశంలోని ఓ నలుగురు గొప్పవాళ్ల పేర్లు చెప్పు చూద్దాం...?" అని అడిగింది
"మా అమ్మ, మా నాన్న, నేను, మా చెల్లి మేడమ్...!!" బదులిచ్చాడు సిద్ధూ.