"అమ్మా... నేను రేపట్నించి స్కూలుకి వెళ్లను" తెగేసి చెప్పాడు చింటూ
"ఏమయ్యింది నాన్నా...?" అడిగింది తల్లి
"మా టీచర్ అన్నీ తప్పులే చెబుతోందమ్మా... సోమవారం ఏమో 5కి ఐదు కలిపితే పది అని చెప్పింది. మంగళవారం ఆరుకి నాలుగు కలిపితే పది అని చెప్పింది. ఈరోజేమో ఏడుకి మూడు కలిపితే పది అని చెబుతోంది... అందుకే నే స్కూలుకెళ్లా...!!"