Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలు ఆరుబయట ఆడుకోవట్లేదా? వామ్మో.. జాగ్రత్త పడాల్సిందే...

పిల్లలు ఆరుబయట ఆడుకోవట్లేదా? ఎప్పుడూ ఇంటికే పరిమితమై.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? ఐతే తల్లిదండ్రులు జాగ్రత్తపడకపోతే.. అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు.

Advertiesment
పిల్లలు ఆరుబయట ఆడుకోవట్లేదా? వామ్మో.. జాగ్రత్త పడాల్సిందే...
, శుక్రవారం, 25 మే 2018 (09:11 IST)
పిల్లలు ఆరుబయట ఆడుకోవట్లేదా? ఎప్పుడూ ఇంటికే పరిమితమై.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? ఐతే తల్లిదండ్రులు జాగ్రత్తపడకపోతే.. అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. ఎందుకంటే గంటల తరబడి టీవీ చూస్తూ.. కూర్చుండిపోయే.. పిల్లల్లో గుండె, ఊపిరితిత్తులు, ఊబకాయం వంటి సమస్యలు తప్పవని.. మొత్తానికి వారి ప్రాణానికే ఈ అలవాట్లు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
స్కూళ్ల నుంచి ఇంటికొచ్చాక.. సమయం దొరికితే చాలు టీవీలు ఫోన్ల ముందు కూర్చునే చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయని.. ఈ అలవాటు మంచిది కాదని బర్లింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరించారు. కూర్చొని ఎక్కువ సేపు టీవీ చూసే పిల్లల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. చిరుతిళ్లు తింటూ టీవీ చూస్తే, గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
 
ఎక్కువగా టీవీ చూసేవారికి ఊబకాయ సమస్యలు వస్తాయని పరిశోధకులు తేల్చారు. ఈ సమస్య చిన్నారుల్లోనే కాకుండా 45 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15వేల మందిపై చేసిన అధ్యయనంలో.. టీవీ చూసే వారిలో గుండెకు సంబంధించిన ముప్పు ఎక్కువగా తెలియవచ్చింది. ఎక్కువగా టీవీ చూసేవారి ఊపిరితిత్తులు కూడా పాడవుతాయని.. ఇవన్నీ ప్రాణాల మీదకే తెచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండుద్రాక్ష ఎందుకు తినాలో తెలుసా?