Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల డైపర్‌‌లలో విష రసాయన పదార్థాలు.. రిపోర్టులో వెల్లడి (Video)

Advertiesment
పిల్లల డైపర్‌‌లలో విష రసాయన పదార్థాలు.. రిపోర్టులో వెల్లడి (Video)
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (14:41 IST)
baby diapers
పిల్లల డైపర్‌లో విష రసాయన పదార్థాలు వున్నట్లు తాజా రిపోర్ట్‌లో వెల్లడి అయ్యింది. పిల్లలకు ప్రస్తుతం డైపర్లను వాడటం బాగా ఎక్కువైపోయిన తరుణంలో.. ఆ డైపర్లలో విష రసాయనాలు వున్నాయనే వార్తలు ప్రస్తుతం పారెంట్స్‌కు షాకిస్తున్నాయి. ఈ డైపర్ల వాడకం ద్వారా పిల్లల ఆరోగ్యానికి హాని చేసే విష రసాయనాలు వున్నట్లు వెల్లడి అయ్యింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది.  
 
ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచే తల్లిదండ్రులు తప్పకుండా డైపర్లను వాడుతున్నారు. ఇవి అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇంటి వరకైతే పర్లేదు కానీ.. పిల్లలను బయటికి తీసుకెళ్లే తల్లిదండ్రులు డైపర్లను తప్పకుండా వాడుతున్నారు. కానీ కొందరు ఇంట్లో వున్నప్పుడు కూడా పిల్లలకు డైపర్లను వాడటం చేస్తున్నారు. అయితే ఇలా డైపర్లను వాడటం ద్వారా ఏర్పడే హానికరమైన విషయాలు తెలిస్తే ఖంగుతింటారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  
 
ఈ నేపథ్యంలో డైపర్లు పిల్లక ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. ఇంకా డైపర్‌లోని పాథ్లెట్ (phthalate) అనే విష రసాయనాలు పిల్లల్లో రక్తపోటు, మధుమేహం, ఒబిసిటీ వంటి సమస్యలకు కారణమవుతాయని పరిశోధనలో తేలింది. దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో phthalate కలిపిన డైపర్లను నిషేధించడం జరిగింది.

అయితే భారత్‌లో మాత్రం phthalateతో తయారైన డైపర్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. phthalate ఈ రసాయనంపై భారత ప్రభుత్వం నిషేధం విధించే వరకు డైపర్లను వాడే మదర్స్.. చాలామటుకు కాటన్ దుస్తులను ఎంచుకోవడం బెటరని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ హృదయ దినోత్సవం: ఆరోగ్యకరమైన గుండె కోసం కొన్ని కోట్స్...