Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవి కాలంలో పిల్లలకు పోషకాహారం ఇవ్వండి.. ఈ జావను తాగిస్తే..?

వేసవి కాలంలో చిన్నారుల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. టీకాలను సకాలంలో వేయాలి. పండ్లు, తాజా కూరగాయలు, తాజా పండ్ల రసాలు, పది నిమిషాలకోసారి నీటిని తాగిస్తుండాలి. రోజుకు మూడుసార్లు గ్లాసుడు పాలు తాగించాల

వేసవి కాలంలో పిల్లలకు పోషకాహారం ఇవ్వండి.. ఈ జావను తాగిస్తే..?
, శనివారం, 25 మార్చి 2017 (15:44 IST)
వేసవి కాలంలో చిన్నారుల ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. టీకాలను సకాలంలో వేయాలి. పండ్లు, తాజా కూరగాయలు, తాజా పండ్ల రసాలు, పది నిమిషాలకోసారి నీటిని తాగిస్తుండాలి. రోజుకు మూడుసార్లు గ్లాసుడు పాలు తాగించాలి. అప్పుడే వారికి సరిపడా క్యాల్షియం లభిస్తుంది. తద్వారా పిల్లల్లో పెరుగుదల సులభమవుతుంది.

వేసవిలో పిల్లలకు ఏర్పడే చర్మ వ్యాధులను దూరం చేయాలంటే.. పిల్లలు నిద్రించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలు ఉపయోగించే వస్తువులు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలి. క్రిమిసంహారక డిటర్జెంటులతో పిల్లలు ఉపయోగించే దుస్తులను శుభ్రం చేసుకోవాలి. 
 
ఇక ఆరోగ్య పరంగా పోషకాహారం తీసుకోవాలి. గోధుమలు, సజ్జలు, రాగులు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్షలు, సోయా, అలసందలు వంటివి తలా 50 గ్రాములు తీసుకుని.. దోరగా వేపి పిండికొట్టుకొచ్చుకోవాలి. ఈ పిండిని జావలా తయారుచేసి పిల్లలకు రోజూ తాగిస్తే.. బలం లభిస్తుంది. ఇందులో పంచదార చేర్చాల్సిన అవసరం ఉండదు. ఈ జావను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా కేరట్, బీన్స్, బీట్ రూట్, పొటాటో, క్యాలీఫ్లవర్‌ ముక్కలు ఒకపప్పు, అరకప్పు కందిపప్పు, బియ్యం అరకప్పు, మూడు కప్పుల నీరు, జీలకర్ర అరస్పూన్, ఉప్పు, పసుపు పొడి వీటినన్నింటిని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి.. అందులో కాస్త నెయ్యి చేర్చి పిల్లలకు తినిపిస్తే.. పిల్లలకు కావాల్సిన పోషకాలు అందుతాయి.  
 
ఇకపోతే ఆపిల్ పండును పది నిమిషాల పాటు నీటిలో ఉడికించి పిల్లలకు తినిపించవచ్చు. లేదా రోజుకో ఆపిల్ చొప్పున పిల్లలకు తినిపించడం.. డాక్టర్లకు పెట్టే ఖర్చును తగ్గించినట్లవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిడ్స్ సృష్టించింది ఎవరో తెలుసా...!