Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిడ్స్ సృష్టించింది ఎవరో తెలుసా...!

ఎయిడ్స్‌ను సృష్టించడం ఏమిటి. అది మామూలుగా లైంగింకంగా వచ్చే రోగం కదా.. దీన్ని సృష్టించడం ఏమిటి అనుకుంటున్నారా. అసలు ఎయిడ్స్‌ను కనిపెట్టి జనాలపైకి వదిలింది ఒక మనిషేనట. అసలు ఆ వ్యక్తి ఎవరు.. ఆయన గురించి తెలుసుకోవాలంటే దీన్ని చదవండి

Advertiesment
ఎయిడ్స్ సృష్టించింది ఎవరో తెలుసా...!
, శనివారం, 25 మార్చి 2017 (15:37 IST)
ఎయిడ్స్‌ను సృష్టించడం ఏమిటి. అది మామూలుగా లైంగింకంగా వచ్చే రోగం కదా.. దీన్ని సృష్టించడం ఏమిటి అనుకుంటున్నారా. అసలు ఎయిడ్స్‌ను కనిపెట్టి జనాలపైకి వదిలింది ఒక మనిషేనట. అసలు ఆ వ్యక్తి ఎవరు.. ఆయన గురించి తెలుసుకోవాలంటే దీన్ని చదవండి.
 
ఎయిడ్స్.. నిస్సందేహంగా ఒక మహమ్మారి. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. మందులకు, వైద్యానికి లొంగనిది కావడంతో ఎయిడ్స్ ఒక భయంకరంగా పరిణమించింది. దశాబ్దాలుగా ఎయిడ్స్ ఎన్ని కోట్ల మందిని బలి తీసుకుని ఉంటుందో లెక్కే లేదు. ప్రత్యేకించి అసురక్షిత శృంగారంతో ముడిపడిన వ్యాధి కావడంతో ఇది ప్రబలే వేగం కూడా అంతే స్థాయిలో ఉంది.
 
మరి ఈ ఎయిడ్స్ నియంత్రణ గురించి ఎంతో కసరత్తు జరుగుతోంది. ఎంతోమంది పరిశోధకులు ఎయిడ్స్ నియంత్రణ కోసం, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నయం చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎయిడ్స్‌కు ఇంతవరకూ మందు కనుగొనలేదు.. కేవలం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే మార్గంగా కొనసాగుతోంది.
 
మరి ఇలాంటి మహమ్మారి గురించి అమెరికన్ వైద్య పరిశోధకుడు ఒకరు సంచలన ప్రకటన చేశాడు. ఎయిడ్స్ వైరస్‌ను సృష్టించింది తనేనని ఇతడు అంటున్నారు. వైరస్‌ను సృష్టించి మానవాళి మీదకు వదిలానని చెబుతున్నాడు. విపరీతంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికే ఈ పని చేశానని ఇతడు చెప్పుకుంటున్నాడు. ఎయిడ్స్‌తో భూమిపై సంభవిస్తున్న వినాశనానికి, నష్టానికి మూలకర్తను తనేనని అతడు ప్రకటించుకుంటున్నాడు.
 
అతడి పేరు డాక్టర్ రాబర్ట్ గల్లో. అమెరికన్ వైద్య పరిశోధకుడు. ఎయిడ్స్ వైరస్‌ను గుర్తించిన పరిశోధకుల్లో ఒకరిగా పేరుంది ఈయనకు. మరి మనిషిలో ఈ వైరస్ జాడను కనుగొన్న ఇతడు.. దాన్ని సృష్టించింది కూడా తనే అంటున్నాడు. మానవాళి వినాశనానికే దాన్ని సృష్టించానని చెప్పుకుంటున్నాడు. అచ్చం ఒక రాక్షసుడిలా మాట్లాడుతున్నాడితను.
 
మరి ఇన్నాళ్లూ ఎయిడ్స్ వైరస్ మానవుల్లో ప్రబలడానికి వేర్వేరు థియరీలు ప్రచారంలో ఉన్నాయి. ఎయిడ్స్ ముందుగా ఆఫ్రికాలో మొదలైందని.. అక్కడి మనుషులు కొంతమంది చింపాజీలతో సెక్స్ చేయడం వల్ల.. వాటి నుంచి మనుషుల్లోకి ఎయిడ్స్ వైరస్ ఎంటరయ్యిందని, అలా క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అలుముకున్నట్టుగా కొన్ని థియరీల్లో పేర్కొన్నారు.
 
అయితే ఈ అమెరికన్ డాక్టర్ మాత్రం ఎయిడ్స్‌ను తనే సృష్టించానని.. మనుషుల వినాశనాన్ని కోరుతూ ఆ పని చేశానని అంటున్నాడు. మరి సంచలనం కోసమే ఈ మాట మాట్లాడుతున్నాడా లేక నిజంగానే వినాశనానికి కారణం ఇతడేనా? మొత్తం మీద ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైద్యుల్లో ఒక గందరగోళానికి తెరలేపాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో రోజూ 3 లీటర్ల నీరు తాగండి.. మజ్జిగ, కొబ్బరినీళ్లు తప్పనిసరి..