Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా పనులేంటో మీకు తెలుసుకదా.. అంటూ వారిని..?

నా పనులేంటో మీకు తెలుసుకదా.. అంటూ వారిని..?
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:39 IST)
వేసవి సెలవులు వచ్చేశాయి. దాంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆ కోర్సులో చేర్పించాలి.. ఈ కోర్సులో చేర్పించాలని చెప్తుంటారు. ఎక్కడెక్కడో డబ్బులు కట్టి చేర్పించే బదులు.. ఇంట్లోనే చిన్నారులకు అమ్మ కష్టం తెలియజేస్తూ.. పనులు భాగస్వాముల్ని చేయడం వలన వ్యక్తిత్వ పాఠాలు నేర్చుకుంటారు. 
 
నా పనులేంటో మీకు తెలుసుకదా.. అంటూ వారిని మీతో పాటూ నిద్రలేపాలి. ఏ పనీ చెప్పకుండా.. బడి ఉన్న రోజు అన్నీ ఎలా వారికి అమర్చుతారో ప్రత్యక్షంగా చూపాలి. అంతేకాదు, ఇంటి పనుల కోసం ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారు.. అందుకోసం అన్నీ ఎలా సమన్వయం చేసుకుంటారనేది వాళ్లకు అర్థమయ్యేలా చూడాలి.
 
పిల్లల్ని ఒక్కసారిగా నువ్వు ఈ పని చేయ్.. ఆ పని చేయ్ అని ఆర్డర్లు వేయకూడదు. వారికి అసలు అమ్మగా మీ దినచర్య ఏమిటో తెలియజేయాలి. ఉద్యోగినులైనా, గృహిణులైనా పిల్లల కోసం చేస్తున్న త్యాగాన్ని వారికి వివరించాలి. అలానే సమయానికి బడికి పంపుతున్నారంటే.. అందుకు వెనుక మీరు పడే కష్టం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అలా వివరించే క్రమంలో చిన్నారులు అడిగే సందేహాలను తప్పకుండా తీర్చాలి. 
 
ముఖ్యంగా చిన్నారులకు పోటీలూ, బహుమతులూ అంటే చాలా ఇష్టపడతారు. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కనుక మీలో ఎవరు ఫలానా పని త్వరగా చేస్తారో చూద్దాం అని వారికి చిన్న పోటీ పెట్టాలి. నేను చేస్తా.. నేను చేస్తా అంటూ.. పనిలో నిమగ్నమవుతారు.. అలా చిన్నారులు ఏ పనిచేసినా వెంటనే ఎంత బాగా చేశావో.. అంటూ పొగిడినా, చిన్న బహుమతి ఇచ్చినా.. వారిలో ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతచిగురుతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్