వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదు. ముఖ్యంగా పిల్లలు మయొనైజ్ ఎక్కువగా తీసుకోకూడదు. శీతాకాలం, వానాకాలంలో మయొనైజ్‌ను వాడవద్దు. ఎగ్‍తో తయారు చేసే దానితో పాటు రకరకాలైన మయొనైజ్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా దొరికే ఎగ్ బేస్డ్ మయొనైజ్‍ను గుడ్డు సొన, నూనె, వెనిగర్, నిమ్మరసంతో తయారు చేస్తారు. క్రీమీ టెక్స్చర్ ఉండేలా చేస్తారు.
అయితే, దాన్ని సరిగా నిల్వ చేయాల్సి ఉంటుంది. సరిగా నిల్వ చేయని మయొనైజ్ తింటే అనారోగ్యానికి చేటు కలుగుతుంది. గుడ్లతో ఇంట్లో తయారు చేసే మయొనైజ్‍తో ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ ఉంటుంది. పచ్చి గుడ్డులోని సాల్మోనెల్లా బ్యాక్టిరీయా వల్ల ఈ ప్రభావం ఉంటుంది.
ఆహారం కల్తీ కావొచ్చు. మార్కెట్లో దొరికే మయొనైజ్‍లను పాయిశ్చరైజ్డ్ గుడ్లతో తయారు చేస్తారు. అయితే, సరిగా నిల్వ చేయని కారణంగా వాటిలోనూ బ్యాక్టిరియా పెరుగుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది.
మయొనైజ్‍లో క్యాలరీలు, ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అతిగా తీసుకుంటే బరువు పెరేలా చేస్తుంది. మయొనైజ్ బదులు.. గ్రీక్ యగర్ట్, హమ్మస్ లాంటివి వాడొచ్చు. వీటివల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.