పవన్ మెసెంజర్ పేరిట వాట్సాప్ లాంటి మొబైల్ యాప్.. విశాఖ కుర్రాడు కనిపెట్టేశాడు..
విశాఖకు చెందిన ఓ కుర్రాడు.. వాట్సప్ లాంటి మొబైల్ యాప్‌ను రూపొందించాడు. ఇందుకు పవన్ మెసెంజర్ అని పేరు కూడా పెట్టాడు. దీనిని గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేయాలంటే.. ముందుగా డెవలపర్ కన్సల్టెన్సీ అనుమతి
విశాఖకు చెందిన ఓ కుర్రాడు.. వాట్సప్ లాంటి మొబైల్ యాప్‌ను రూపొందించాడు. ఇందుకు పవన్ మెసెంజర్ అని పేరు కూడా పెట్టాడు. దీనిని గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేయాలంటే.. ముందుగా డెవలపర్ కన్సల్టెన్సీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు.. అందుకు అవసరమైన అన్ని వివరాల తో రిజిస్టర్ చేసుకుని ప్లేస్టోర్‌లోకి అప్‌లోడ్ చేశాడు.
ఈ మెసెంజర్ యాప్‌లో గ్రూప్ చాటింగ్, ఛానల్ క్రియేషన్, కాలింగ్ సదుపాయంతో కూడిన చాట్ బ్యాక్ గ్రౌండ్ ఛేంజ్, వీడియో కంప్రస్ వంటి ఫీచర్లు ఉంటాయి. సామాన్యులకు సైతం ఈ యాప్ సులువుగా అర్థమవుతుంది. టెలిగ్రామ్ ఆర్గనైజేషన్ అంతర్జాలంలో ఉంచిన నెట్ సర్వీసుతో ఈ 'పవన్ మెసెంజర్'పని చేస్తుంది.
ఈ'పవన్ మెసెంజర్'ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా విశాఖలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆదుర్తి సూర్యచంద్ర పవన్‌కు టెక్నాలజీపై గల ఆసక్తితో ఈ యాప్‌ను రూపొందించాడు.