అబ్బా ఫాస్ట్ లైఫ్‌తో మతిపోతోందా? అయితే బాదం మిల్క్ తాగండి..
ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఒకటే పని. ఉరుకులు పరుగులతో కాలం గడపాల్సి వస్తుంది. దీనికి తోడు ఆందోళనలు, ఒత్తిడి. తద్వారా మతిపోతుంది. జ్ఞాపకశక్తి మందగించడం జరుగుతుంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మ
ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఒకటే పని. ఉరుకులు పరుగులతో కాలం గడపాల్సి వస్తుంది. దీనికి తోడు ఆందోళనలు, ఒత్తిడి. తద్వారా మతిపోతుంది. జ్ఞాపకశక్తి మందగించడం జరుగుతుంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మోతతో సతమతమైపోతున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే జ్ఞాపకశక్తి చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు పోషకాహారం తీసుకోవడం చాలా ఉత్తమం.
రోజూ ఆహారంలో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు జ్ఞాపకశక్తి పెరగాలంటే బాదంపాలు ఎంతో ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
అంతేకాదండోయ్ బాదం పాలలో సోడియం తక్కువగా ఉండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె నొప్పి, బీపీ అవకాశాలను తగ్గిస్తుంది. బాదంలో ఉండే కాల్షియం ఎముకల పటుత్వంకు సహకరిస్తుంది. బాదంపప్పులో ఐరన్ ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.