Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలకు రోజూ ఓ ఆరెంజ్ ఇస్తే.. ఎంత మంచిదో తెలుసా?

Advertiesment
పిల్లలకు రోజూ ఓ ఆరెంజ్ ఇస్తే.. ఎంత మంచిదో తెలుసా?
, బుధవారం, 6 మార్చి 2019 (11:56 IST)
రోజూ పిల్లలకు ఓ ఆరెంజ్ పండును ఆహారంలో భాగం చేస్తే ఎంత మేలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. కమలాపండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. రోజూ ఓ గ్లాసు కమలాపండు రసం తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ ఓ ఆరెంజ్‌ తినేవాళ్లలో కంటిచూపు తగ్గడం అనేది ఉండదట. 
 
ఆరెంజ్‌లోని విటమిన్‌-సి, పొటాషియం ద్వారా గుండె పనితీరు మెరుగ్గా వుంటుందట. అందుకే రోజూ కనీసం ఓ ఆరెంజ్‌ తింటే హృద్రోగ సమస్యలు కూడా తక్కువ అంటున్నారు. కమలాపండ్లలో పీచు కూడా ఎక్కువ. అందుకే పిల్లల్లో డయేరియా వంటివి కూడా తగ్గుతాయి. 
 
ఇంకా ఆరెంజ్‌లో విటమిన్‌-సి గాయాల్నీ ఇన్ఫెక్షన్లనీ కూడా త్వరగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘుమఘుమలాడే టమోటా సూప్..?