పిల్లలు స్వీట్ కార్న్ ఇష్టపడి తింటున్నారా.. అయితే వారికి స్నాక్స్ డబ్బాలో స్వీట్ కార్న్ తప్పక చేర్చండి. స్వీట్ కార్న్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. స్వీట్ కార్న్‌లో కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. స్వీట్ కార్న్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.