చేపలు, కోడిగుడ్లు పిల్లలకు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

శనివారం, 26 జనవరి 2019 (16:57 IST)
పిల్లలు హుషారుగా వుండాలంటే వారానికి రెండుసార్లైనా చేపలు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఒమెగా-త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలేు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. 
 
అలాగే కోడిగుడ్లు రోజుకొకటి తీసుకునే చిన్నారులు చురుకుగా వుంటారు. ఇంకా చిన్నారులకు కావలసిన పోషకాలు పూర్తిగా అందుతాయి. గుడ్లలో వుండే ప్రోటీన్లు చిన్నారుల శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే చిన్నారులకు అందించే అల్పాహారంలో రోజుకో గుడ్డు చేర్చుకోవాలి. 
 
అలాగే సౌందర్య పోషణలో గుడ్డు మెరుగ్గా పనిచేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు, గాట్లు, గరుకుదనం పోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన, చెంచాడు మీగడ, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 
 
కోడిగుడ్డులోని తెల్లసొనను తలపై సున్నితంగా మర్దన చేసుకుని, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బీట్‌రూట్ హల్వా భలే టేస్ట్.. ఎలా చేయాలో తెలుసా?