సోషల్ మీడియా స్టూడెంట్స్‌కు సంబంధించిన వీడియోలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులు ఎంత సూపర్‌గా టీచ్ చేస్తున్నారనేందుకు ఎన్నో వీడియోలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూనే వున్నాయి. తాజాగా అలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో చిన్నారులకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పే పద్ధతిని అధ్యాపకులు అనుసరించాలనే చెప్పాలి. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే.. ఏ ఫోర్ షీటును పట్టుకుని వరుసగా నిల్చున్న విద్యార్థులు.. ఒక ఆంగ్ల పదంలో దానివున్న మూడేసి పదాలను చెప్తూ.. దానిని ఆ పేపర్లో చూపెడుతూ.. చదువుతున్నారు. ఉదాహరణకు "Price" అని రాసివుండే ఏ ఫోర్ చార్టులో ప్రైస్, రైస్, ఐస్ అనే మూడు పదాలు దాగివున్నాయనే విషయాన్ని విద్యార్థి చదువుతోంది.
ఇదే విధంగా మిగిలిన విద్యార్థులు ఒక ఆంగ్లపదంలో దాగివున్న ఇతర పదాలను చదువుతున్నారు. ఈ వీడియోలో ఇలా సులభంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్న టీచర్ ఎవరని నెటిజన్లు అడుగుతున్నారు. ఈ పద్ధతి అద్భుతమని కొనియాడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.